ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ చేయబోతున్న గవర్నర్ తమిళ సై, బండారు దత్తాత్రేయ

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకల సందడి మొదలైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే ఖైరతాబాద్ వినాయకుడు భక్తుల సందర్శనకు సిద్ధమయ్యాడు. ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకునే ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. రెండు నెలలపాటు నిరంతరం శ్రమించిన శిల్పులు వినాయక చవితికి ఐదు రోజుల ముందే గణనాథుడిని సిద్ధం చేసి ఉంచారు.

రేపు ఖైరతాబాద్‌ మహా గణపతి కి అట్టహాసం గా మొదటి పూజ చేయనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు గణ నాధుడు తొలి పూజ అందుకోనున్నారు. ఈ తొలి పూజ లో తెలంగాణ గవర్నర్ తమిళ సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొననున్నారు. ఈ సారి 40 అడుగుల ఎత్తు లో శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా దర్శనం ఇస్తున్నారు. మహాగణపతి కి ఇరు వైపులా క్రిష్ణ కాళి, కాల నాగేశ్వరిలు ఈ సారి దర్శనం ఇస్తున్నారు. కరోనా నేపథ్యంలో మహా గణపతి కమిటీ సభ్యులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల మధ్య సామజిక దూరం ఉండేలా చూస్తున్నారు.