ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ ఇకలేరు

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హాస్పటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12.31 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈమేరకు ఆయన కుమారుడు సింగరి రాజ్ కుమార్ తెలిపారు. ఆయన అంతిమ యాత్ర శనివారం ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక వరకు కొనసాగుతుందన్నారు.

ఇక హైదరాబాద్ లో వినాయక చవితి అనగానే.. ముందుగా ఖైరతాబాద్ బడా గణేశ్ గుర్తొస్తాడు. ఖైరతాబాద్ కౌన్సిలర్‌గా పని చేసిన సుదర్శన్ సోదరుడు సింగరి శంకరయ్య చేతుల మీదుగా 1954లో ఇక్కడ గణేశ్ ఉత్సవాల నిర్వహణ మొదలైంది. ఒక అడుగు ఎత్తు విగ్రహంతో మొదలుపెట్టిన ఉత్సవాలు 60 ఏళ్ల వరకు ఒక్కో అడుగు పెంచారు. 2014 నుండి ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. విగ్రహం ఎత్తు తగ్గినా రూపకల్పనలో ప్రతి సంవత్సరం వైవిధ్యతను చాటుతున్నారు.