విండీస్ జట్టులో కీలక మార్పు

ఆంటిగ్వా: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా ఆంటిగ్వాలోకి సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. జట్టు పేస్ బౌలర్ కీమో పాల్ ఎడమ మడిమ భాగంలో తీవ్ర గాయం కావడంతో అతను ఈ మ్యాచ్కి దూరమవుతున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. అతని స్థానంలో మిగుల్ కమ్మిన్స్ని జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫలితంగా వెస్టిండీస్ 13 మంది ఆటగాళ్లతో ఈ మ్యాచ్ బరిలోకి దిగనుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/