కోవిడ్వేళ కీలక బడ్జెట్
నేటినుంచి బడ్జెట్ సమావేశాలు
పన్నుశ్లాబుల సడలింపులపైనే అందరి ఆశలు
సుంకాల తగ్గింపుపై కార్పొరేట్ ఎదురుచూపు
పార్లమెంటులో రైతువాణి వినిపించేందుకు విపక్షం సిద్ధం

New Delhi: కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్న బడ్జెట్ ఇపుడు యావత్భారత్కు అత్యవసరం అవుతోంది. ప్రధానంగా ఆదాయపు పన్నుశ్లాబ్లపైనే ఇపుడు అందరినోటా చర్చ నలుగుతోంది. కొవిడ్మహమ్మారి సంక్షోభంతో కుప్పకూలిన ఆర్థికవ్యవస్థకు జవజీవాలం దిం చేందుకు ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇప్పటివరకూ అమలుకువచ్చిన బడ్జెట్లలోనే కీలకం అని చెప్ప కతప్పదు. ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారా మన్కు ఈ బడ్జెట్కేటాయింపులు ఒకసవాల్ వం టిదనే చెప్పాలి.
ముఖ్యంగా పన్నుచెల్లింపుదారులే గడచిన రెండుమూడునెలలుగా కొత్తపన్నుల సంస్కరణలపై ఎంతో ఆసక్తితో ఉన్నారు. ఇప్పటి వరకూ కేవలం 2.5 లక్షల ఆదాయం ఉన్నవారికే పన్నునుంచి మినహాయింపు లభిం చింది. ఇకపై ఈ పరిమితిని ఐదులక్షలకు పెం చాలన్న డిమాండ్ ఎంతకాలంగానో వినిపిస్తోంది. అదేవిధంగా ఐదునుంచి 30శాతం వరకూ ఉన్న ఆదాయపు పన్నుశ్లాబ్లకు కొంతమేర సడలింపులు ఇవ్వడం తోపాటు సూపర్‌రిచ్‌పై విధించే సర్ఛార్జిని పరిశీ లించాలన్న డిమాండ్‌కూడా వినిపిస్తోంది.
అన్నింటి కంటేముఖ్యంగా కార్పొరేట్ రంగం బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెంచుకుంది. దిగుమతి సుంకాల్లో సడలిం పులు ఇవ్వాలన్న డిమాండ్ కూడా కొన్ని రంగాలు కోరుతున్నాయి. స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు స్వేఛ్ఛావాణిజ్య విధానం అమలుకావాలన్న డిమాండ్‌కూడా లేకపోలేదు. అదేవిధంగా వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబం ధించి మినహాయింపులు లభించే ఐటి చట్టం సెక్షన్80సి, 80డి పరిమితులను పెంచాలని కోరు తున్నారు. ఇప్పటివరకూ కేవలం 25 వేలుగా ఉన్న పరిమితిని 50వేలకు పెంచాలని, సీనియర ్సిటిజన్లకు 50వేలనుంచి 75 వేలకు పెంచాలని కోరుతున్నారు. కొవిడ్‌లాంటి అత్యవసరపరిస్థి తుల్లో పన్నుచెల్లింపుదారులకు మరింత ఊరటకలి గించాలని డిమాండ్ ఉన్నది. ప్రజల్లో వినిమయ వ్యయశక్తినిపెంచగలిగితే ఆర్థికవృద్ధిపెరుగుతుందని నిపుణుల సలహాలున్నాయి. పన్నులరంగ మౌలిక వనరులను మరోసారి సమీక్షించాల్సి ఉంటుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/