నారా లోకేష్ కీలక ప్రకటన..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక ప్రకటన చేసారు. జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చేవారం బయటపెడతా అని ప్రకటించారు. తన సొంత ఖర్చులతో మంగళగిరిలో ఆరోగ్య సంజీవనికేంద్రాన్ని ప్రారంభించిన లోకేష్ ..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తనదైన స్టయిల్ లో విరుచుకుపడ్డారు. 10వ తరగతి పాస్, డిగ్రీ ఫెయిల్ అయిన తెలివితేటలు జగన్ మోహన్ రెడ్డివి అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి టైమప్ అయిపోయి ఇంటికెళ్లే పరిస్థితి వచ్చేసిందన్నారు.

‘‘జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కంటే తరలిపోయినవే ఎక్కువ. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతా అనే చర్చే జరుగుతోంది. గత 3 ఏళ్లలో రాష్ట్రానికి తెచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధం అన్నారు. జగన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్న ప్రతీ పరిశ్రమ టీడీపీ ప్రభుత్వ కృషే. టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 లక్షల ఉద్యోగుల కల్పన జరిగిందని జగన్ ప్రభుత్వమే ఒప్పుకుంది. దాదాపు 500 హామీల్లో మాట తప్పి మడమ తిప్పిన జగన్ 175 నియోజకవర్గాలు గెలిపించాలా..? ఈడీ, ఐటీ, సీబీఐ భయంతో ఢిల్లీలో మెడలు వంచుతున్న జగన్ రాష్ట్రానికి ఏం సాధించారు.’’ అని నారా లోకేశ్ ప్రశ్నించారు.

వైస్సార్సీపీ హయాంలో వచ్చినవాటి కంటే వెళ్లిపోయిన పరిశ్రమలే ఎక్కువని .. పెట్టుబడులు పెట్టాలంటే సీఎంవో వాటా ఎంతనేది చర్చకు వస్తోందని లోకేష్ ఆరోపించారు. వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చకు సిద్ధమని లోకేష్ ప్రకటించారు.