ఫైనల్స్‌కు ఇండియా, ఇంగ్లండ్ జట్లు!

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. లీగ్ స్థాయిని దాటి నాకౌట్ దశకు చేరుకుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్స్‌కు ఏయే జట్లు చేరబోతున్నాయో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ జోస్యం చెప్పాడు.
సెకండ్ సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఓడిస్తుందని పీటర్సన్ చెప్పాడు. ఆదివారం లండన్‌లో జరిగే ఫైనల్స్‌లో ఇండియా, ఇంగ్లండ్‌లు తలపడతాయని జోస్యం చెప్పారు. ఇండియాను ఓడించే జట్టే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని ట్వీట్ చేశాడు.
తాజా సినిమా వీడియోల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos