ఏపిలో మరిన్ని కరోనా పాజిటివ్‌ కేసులు

కొత్తగా మరో 14 కేసులు

corona virus
corona virus

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. కొత్తగా మరో 14 కేసులు మోదు అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏపిలో కరోనా భాధితుల సంఖ్య 266 కి చేరింది. కాగా ఇప్పటి వరకు ఈ వైరస్‌ కారణంగా ఇద్దరు మృతిచెందినట్లు తెలిపింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. నెల్లూరులో 34 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/