జగన్‌ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది

Kesineni Nani, jagan
Kesineni Nani, jagan

అమరావతి: టిడిపి ఎంపి కేశినేని నాని ఏపి సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ‘జగన్ రెడ్డి గారు, పిచ్చివాడి చేతిలో రాయిలా ఉంది మీ చేతిలో అధికారం’ అంటూ ఎద్దేవా చేశారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై నాని స్పందిస్తూ… మీరు చేసిన చట్టమే ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే… హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీలాంటి చోట్ల మన వారికి ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించారు. ‘అమ్మ పెట్టలేదు… అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది పరిస్థితి’ అని ట్వీట్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/