సిఎం జగన్‌ మరో తుగ్లక్‌ కాకుడదు

Kesineni Nani
Kesineni Nani

అమరావతి: ఏపి సిఎం జగన్‌పై టిడిపి ఎంపి కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఏపి రాజధాని అమరావతి మార్పు ప్రచారంపై మాట్లాడుతు
చిన్నప్పుడు మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ చరిత్రను పుస్తకాల్లో చదివాం జగన్‌ గారు అని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి రాజధానిని దౌలతాబాద్‌కు మార్చేసి ఆ తర్వాత మళ్లి తుగ్లక్‌ ఢిల్లికి రాజధానిని మార్చారన్నారు. జగన్‌ తుగ్లక్‌లాగా చరిత్రకు ఎక్కకూడదని భగవంతుడిని కోరుకుంటున్నానని నాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/