కేశినేని నాని పిర్యాదు ఫై కేశినేని చిన్ని క్లారిటీ

కేశినేని నాని సొంత సోదరుడైన కేశినేని చిన్నిపై విజయవాడ ఫిర్యాదు చేయడం టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ స్టిక్కర్‌తో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని, అలా తిరుగుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ వాహనం నంబరును టీఎస్07హెచ్07హెచ్ డబ్ల్యూ7777గా పేర్కొన్నారు నాని. మే 27నే కేశినేని నాని ఫిర్యాదు చేయగా, జూన్ 9న ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం మీడియా లో వైరల్ గా మారడం తో దీనిపై కేశినేని చిన్నిక్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్ పోలీసులు కారును తీసుకెళ్లి ఎంక్వైరీ చేశారని.. తర్వాత తిరిగి కారును తన దగ్గరికి పంపారన్నారు చిన్ని. తాను వ్యాపారులెవరిని బెదిరించలేదని.. వ్యాపారులను ఎవరిని కలిశానో నిరూపించాలి అన్నారు. ఇన్నాళ్లుగా లేనిది ఈ రెండు నెలల నుంచే ఆరోపణలు ఎందుకు వచ్చాయన్నారు. హైదరాబాద్ వెళుతూ మార్గ మధ్యలో రైతు పోరు సభ పనులు పరిశీలించేందుకు ముందు రోజు వెళ్లానన్నారు. కుటుంబ సమస్యల్ని, ఆడవాళ్లను వివాదాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదని.. ఇది కుటుంబ సమస్య.. పార్టీకి, చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధం లేదన్నారు.

టీడీపీ పార్టీ లో తాను సాధారణ కార్యకర్తను మాత్రమే అని చిన్ని చెప్పుకొచ్చారు. తన సోదరుడు కేశినేని నానితో విభేదించలేదని.. తనను విజయవాడ నుంచి పోటీ చేయమని ఎవరూ అడగలేదన్నారు. పార్టీలో తనకు ఏ హోదా లేదని.. కేసుతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. చంద్రబాబు ఏ ఆదేశాలు ఇస్తే అదే చేస్తానని.. పార్టీ అధికారంలోకి రావడానికి అవసరమైన కార్యక్రమాలు చేయడానికే తాను ఉన్నాను అన్నారు.ఇక కుటుంబపరంగా చిన్న, చిన్న వివాదాలు జరుగుతుంటాయని.. ఈ చిన్న విషయాన్ని ఇంత దూరం లాగడం బాధగా అనిపించిందన్నారు.