పౌరసత్వంపై కేరళ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌

ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రకటన చెయ్యాలని సుప్రీంకోర్టును కోరిన కేరళ ప్రభుత్వం

Pinarayi Vijayan
Pinarayi Vijayan

కేరళ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని ప్రకటన చెయ్యాల్సిందిగా సుప్రీంకోర్టును కోరింది. పౌరసత్వ చట్టంపై ఇలా సుప్రీంకోర్టు మెట్లెక్కిన తొలి రాష్ట్రం కేరళే. డిసెంబర్‌లో కేరళ అసెంబ్లీ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఓ తీర్మానం చేసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు, అల్లర్లకు దారితీస్తున్న పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. కేరళ ప్రభుత్వ తీర్మానాన్ని ఎమ్మెల్యేలంతా సమర్థించారు. బిజెపికి చెందిన రాజగోపాల్ మాత్రం సమర్థించలేదు. తీర్మానం చేసిన కేరళ సీఎం పినరయ్ విజయన్… కేంద్రంలో బిజెపి సర్కార్‌పై మండిపడ్డారు. RSS అజెండాను ప్రజల నెత్తిన రుద్దుతూ… మతపరమైన వివాదాలు తలెత్తేలా చేస్తూ… ఈ చట్టాన్ని తెచ్చిందని ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/