ఆటోడ్రైవర్‌ను వరించిన రూ.12 కోట్ల లాటరీ

ఓ ఆటోడ్రైవర్ కు ఏకంగా రూ. 12 కోట్ల లాటరీ వరించి తన జతకన్నే మార్చేసింది. ఓనమ్ పండుగ సందర్భంగా కేరళ ప్రభుత్వం నిర్వహించిన బంపర్ లాటరీలో ఓ ఆటోడ్రైవర్‌ విజేతగా ప్రకటించింది. అతడికి రూ.12 కోట్ల బహుమతి లభించింది. ఆదివారం వెల్లడించిన ఓనం బంపర్‌ లాటరీ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్‌ బంపర్‌ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కోచి సమీపంలో మరాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ పీఆర్‌ జయపళన్‌ కొనుగోలు చేశాడు. జయపళన్ కొనుగోలుచేసి టిక్కెట్‌కు లాటరీ వరించడంతో అతడి సంతోషం మాములుగా లేదు.

‘ఈ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేశాను.. ఫ్యాన్సీ నంబర్‌ కావడంతో లాటరీ బహుమతి లభిస్తుందని అప్పుడే భావించాను’’ అని జయపళన్‌ చెప్పుకొచ్చారు. రూ.12 కోట్ల లాటరీ బహుమతిలో 30 శాతం పన్నులు, 10 శాతం ఏజెంట్ కమిషన్ పోగా ఆయనకు రూ. 7.5కోట్లు లభించనున్నాయి. అదృష్టం ఒక్కసారి పలకరిస్తే.. ఆ మనిషి జీవితం పూర్తిగా మారిపోతుందనడానికి ఆటో డ్రైవర్ జీవితమే ఉదాహరణ.