ఎన్నికలు వస్తే చాలు,.. వారు చాలా యాక్టివ్

ఈడి , సిబిఐ లపై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Kejriwal's sensational comments on ED, CBI
Kejriwal’s sensational comments on ED, CBI

Delhi: ఎన్నిక‌లు వస్తున్నాయంటే చాలు కేంద్ర ఏజెన్సీలు ఈడీ, సీబీఐ చాలా యాక్టివ్ గా మారతాయ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ ఆదివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో ఆప్ నాయ‌కులు స‌త్యేంద్ర‌జైన్ ను కూడా అరెస్ట్ చేస్తారనే స‌మాచారం త‌మ‌కి ఉంద‌ని ఆయన పేర్కొన్నారు. ఆయ‌న‌పై ఇప్ప‌టికే రెండుసార్లు దాడులు జరిగినా ఫ‌లితం శూన్య‌మ‌ని చెప్పారు. అయితే ఈసారి కూడా వారికి స్వాగతం పలుకుతున్నామని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మేం ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడమని అన్నారు. . బీజేపీ అన్ని ఏజెన్సీలను పంపగలదని సత్యేంద్ర జైన్ మాత్రమే కాదు వారు నాకు, మనీష్ సిసోడియా, భగవంత్ మాన్‌లపైన కూడా రైడ్స్ చేయగలరని.. వారిని చిరునవ్వుతో స్వాగతిస్తాం అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించటం సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/