కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం

ఢిల్లీ వేదికపై నుంచి ప్రధాని మోడీ ఆశీస్సులు కోరుతున్నా

arvind kejriwal
arvind kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రత్యర్థుల్ని క్షమిస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేంకు కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ వేదికపై నుంచి ప్రధాని మోడీ ఆశీస్సులు కోరుతున్నామన్నారు. ప్రమాణస్వీకారానికి మోడీని ఆహ్వనించామని..ఆయన వేరే పనుల్లో తీరిక లేకుండా ఉన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మూడోసారి ఆదివారం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మీ బిడ్డ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడని వ్యాఖ్యానించారు. ఇది తన విజయం కాదని..ప్రజల విజయం అని పేర్కొన్నారు. ఢిల్లీ అంతా ఇప్పడు తన కుటుంబమేనని అందరి కోసమ పనిచేస్తానని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/