ప్రైవేట్‌ ఆస్పత్రులపై సిఎం కేజ్రీవాల్‌ ఆగ్రహం

YouTube video

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని ఆస్పత్రులు కరోనా రోగులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయని, వారిని ఎంత మాత్రమూ ఉపేక్షించే ఛాన్స్ లేదని ఆయన హెచ్చరించారు. పలుకుబడిని ఉపయోగించి పడకలను బ్లాక్ మార్కెటింగ్ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, వారిని ఎంతమాత్రమూ ఉపేక్షించమని, ప్రభుత్వం నుంచి వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఆస్పత్రి పడకలు బ్లాక్ మార్కెటింగ్ కాకుండా తాము ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన ప్రకటించారు. అందులో ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి?, ఎన్ని వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి? అన్న సమాచారం అందుబాటులో ఉంటుందని, పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని, కొన్ని రోజులు సమయం కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/