నామినేషన్‌ వేయలేకపోయిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు నామినేషన్ వేయలేకపోయారు. భారీ రోడ్ షో కారణంగా కేజ్రీవాల్ నిర్ణీత సమయానికి నామినేషన్ దాఖలు చేయాల్సిన కార్యాలయానికి చేరుకోలేక పోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు నామినేషన్ వేస్తానని చెప్పారు. నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు కావడం గమనార్హం. మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, నామినేషన్ వేయడానికి సయమం మించిపోతోందని తన మనుషులు తనకు చెప్పారని… కానీ తన కోసం వచ్చిన ఇంత మందిని వదిలి ఎలా వెళ్లగలనని ఆయన ప్రశ్నించారు.ఢిల్లీలోని ప్రఖ్యాత వాల్మీకి మందిర్ నుంచి కేజ్రీవాల్ రోడ్ షో ప్రారంభమైంది. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వరకు రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో కేజ్రీవాల్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ నేత సంజయ్ సింగ్ ఉన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/