బీజేపీకి స‌వాల్ విసిరిన అర‌వింద్ కేజ్రీవాల్

మునిసిప‌ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంట

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బుధ‌వారం ఢిల్లీ అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో బీజేపీకి స‌వాల్ విసిరారు. ఢిల్లీ మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను స‌కాలంలో నిర్వ‌హించి.. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధిస్తే తాము రాజకీయ స‌న్యాసం తీసుకుంటామ‌ని కీలక వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తూ వ‌స్తోంద‌ని ఆరోపిస్తున్న కేజ్రీ.. స‌కాలంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుంటే.. స్వ‌తంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను అవ‌మాన‌ప‌రిచిన‌ట్టేన‌ని వ్యాఖ్యానించారు.

బుధ‌వారం పార్ల‌మెంటు స‌మావేశాల్లో భాగంగా బీజేపీ ఓ బిల్లును ప్ర‌తిపాదించింది. ఢిల్లీలోని మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను క‌లిపేస్తూ ఓ ప్ర‌తిపాద‌న పెట్టింది. ఈ విష‌యం తెలిసినంత‌నే కేజ్రీ ఆగ్ర‌హోద‌గ్రుడ‌య్యారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ.. ఆప్ లాంటి అతి చిన్న పార్టీని చూసి జ‌డుసుకుంటోంద‌ని ఎద్దేవా చేశారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను స‌కాలంలో నిర్వ‌హించ‌డంతో పాటుగా ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే.. ఆప్ రాజ‌కీయ స‌న్యాసం చేస్తుంద‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/