ముద్దు సీన్లలో నటించే ప్రసక్తే లేదు

KEERTI SURESH REDDY-1
KEERTI SURESH REDDY

ముద్దు సీన్లలో నటించే ప్రసక్తే లేదు

కీర్తి సురేష్‌.. మహానటి చిత్రంలో సావిత్రిగారి పాత్రను ఇంతకన్నా ఇంకెవ్వరూ బాగా చేయలేరేమో అన్నంతంగా ఆమె ఆపాత్రలో ఒదిగిపోయారు. అయితే కీర్తిసురేష్‌ అందరి హీరోయిన్లులా కాకుండా మొదటి నుంచి ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉన్న పాత్రల్లే ఎంచుకుంటూ వస్తున్నారు.. తాజాగా సినిమాల్లో ముద్దుసన్నివేశాల గురించి ఆమె స్పందించారు. నేనైతే ఎప్పటికీ ముద్దుసీన్లలో నటించలేనని చెప్పారు. నాకు అలాంటి పాత్రలు గానీ, అలా నటించటం గానీ అస్సలు ఇష్టం ఉండదన్నారు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముద్దుసీన్‌ల్లో నటించే ప్రసక్తే లేదని ఖరాఖండీగా తెలిపారు.. అయినప్పటికీ కీర్తిసురేష్‌కు రోజురోజుకూ అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి.. మహానటి సినిమాతో ఆమె స్టార్‌హీరోయిన్‌ అయ్యిందనే చెప్పాలి.