యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన మహానటి

మాములుగా సినిమా సక్సెస్ అయితే డైరెక్టర్స్ కు హీరోలు విలువైన బహుమతులు ఇవ్వడం ఎక్కువగా చూస్తుంటాం..కానీ సినిమా షూటింగ్ పూర్తి కాగానే చిత్ర యూనిట్ సభ్యులకు విలువైన బహుమతులు ఇవ్వడం చాల అరుదుగా జరుగుతుంటాయి. ఆ మధ్య ఓ హీరో తన సినిమా షూటింగ్ పూర్తి కాగానే యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చేరింది.

ప్రస్తుతం ఈమె నాని సరసన దసరా మూవీ చేస్తుంది. నాని , కీర్తి సురేష్ జంటగా డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా గా మార్చి 30 , 2023 లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ తన పోర్షన్ కు సంబంధించిన చిత్రీకరణ ముగించింది. షూటింగ్ ఆకరి రోజున కీర్తి సురేష్ చిత్ర యూనిట్ సభ్యులు అందరికి గోల్డ్ కాయిన్స్ ను బహుమతిగా ఇచ్చి వారిని సంతోష పెట్టిందట. ఒక్కో కాయిన్ రెండు గ్రాముల వరకు ఉంటుందట.

ఇందుకు గాను కీర్తి సురేష్ దాదాపుగా ఏడు లక్షల రూపాయలను ఖర్చు చేసిందని యూనిట్ చెబుతున్నారు. ఇక దసరా సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామర్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. దసరా పై కీర్తి సురేష్ చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా లోని తన పాత్రకు ఉన్న ప్రాముఖ్యతపై ఆమె చాలా నమ్మకం పెట్టుకుని ఉందట. అందుకే సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత యూనిట్ సభ్యులకు బంగారు కాయిన్స్ ఇచ్చిందని తెలుస్తోంది.