వెస్టిండీస్‌ జట్టులో మార్పులు

windies team
windies team

ఆంటిగ్వా: టీమిండియాతో జరిగే రెండో టెస్టుకు వెస్టిండీస్‌ జట్టులో మార్పులు జరిగాయి. పేసర్‌ మిగెల్‌ కమిన్స్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ కీమోపాల్‌ రానున్నాడు. 13 మంది సభ్యుల జట్టులో అతడికి చోటు దక్కింది. మడమ గాయంతో అతడు తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీమోపాల్‌ అందుబాటులో ఉన్నాడని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. మరో వికెట్‌ కీపర్‌ జామర్‌ హ్యామిల్టన్‌ను జట్టులోనే కొనసాగాలని తాత్కాలిక సెలక్షన్‌ కమిటీ ఆదేశించింది. మడమ గాయంతోనే సిరీస్‌కు దూరమైన షేన్‌ డోరిచ్‌ కోలుకొనేందుకు బార్బడోస్‌కు పయనమయ్యాడు.
వెస్టిండీస్‌ జట్టు: జేసన్‌ హోల్డర్‌ (సారథి), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, డారెన్‌ బ్రావో, షమ్రా బ్రూక్స్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, రోస్టన్‌ ఛేజ్‌, రకీమ్‌ కార్న్‌వాల్‌, జామర్ హ్యామిల్టన్‌, షానన్‌ గాబ్రియేల్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, షై హోప్‌, కీమో పాల్‌, కీమర్‌ రోచ్‌.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/