కేసీఆర్ వరంగల్ టూర్ రద్దు

cm-kcr-elected-as-a-trs-president

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి , తెరాస అధినేత కేసీఆర్ వరంగల్ టూర్ రద్దయ్యింది. ఈనెల 10న వరంగల్‌లో కేసీఆర్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేసారు. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణా, అభివృద్ధి కి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే ఓవర్ బ్రిడ్జి ( ఆర్ వో బి) ల నిర్మాణం వంటి పనులకు శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. కానీ చివర్లో కేసీఆర్ టూర్ రద్దయ్యింది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి రావడంతో సీఎం పర్యటన రద్దయిందని అధికార వర్గాలు తెలిపాయి. తిరిగి ఎప్పుడు వెళతారనేది త్వరలో వెల్లడిస్తామని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పర్యటన రద్దుతో ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. కాగా, ఈనెల 29న జరగనున్న విజయగర్జన సభ సభ సైతం వాయిదా పడింది. మరోపక్క తెలంగాణ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఎన్నికల కోడ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 500 మందికి మించి ఎక్కడా సభలు పెట్టరాదని నిబంధనలు విధించారు.