శ్రీవారి సేవలో తెలంగాణ సిఎం కెసిఆర్‌

kcr
kcr

తిరుమల: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈరోజు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి స్వామి దర్శనానికి వచ్చిన కెసిఆర్‌ కు రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆదిమూలం, నారాయణస్వామి, నవాజ్‌బాషా, నాయకులు ఎమ్మార్సీరెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ఉదయం మహాద్వారం ద్వారా కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. . తిరుమలలో ముఖ్యమంత్రికి తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టీ స్వాగతం పలికి బస సౌకర్యం కల్పించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/