గాంధీ హాస్పటల్ ఎదురుగా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

సికింద్రాబాద్ గాంధీ హాస్పటల్ లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కారించి నివాళ్లు అర్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ వాణీదేవి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.

గాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25కోట్లతో గాంధీ హాస్పటల్ ఎంట్రిన్స్ ఎదుట ఏర్పాటు చేసింది. 16 అడుగుల ఎత్తుతో, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్‌ సుతార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారితో హెచ్‌ఎండీఏ అధికారులు నెలకొల్పారు. అంతకుముందు గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సికిద్రాబాద్‌ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి ఘటించారు. అలాగే ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.