జగన్, మోడిల ప్రమాణస్వీకారానికి సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ ఈరోజు ప్రధానిగా మోడి, ఏపి సిఎంగా జగన్‌ల ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కెసిఆర్ ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుంటారు. అక్కడ స్థానికి హోటల్లో బస చేస్తారు. మధ్యాహ్నం 12.08కి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుని జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. తిరిగి హోటల్‌కు చేరుకుని భోజనం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ నుండి ఢిల్లీకి బయల్దేరుతారు. రాత్రి 7గంటలకు జరిగే ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/