ఈనెల 25న మరోసారి ఢిల్లీ కి సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఢిల్లీ లో టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండి, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తదితరులను కలిశారు. వారితో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ నెల 25న మరో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఈ నెల 26న దిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది.