రేపు ఢిల్లీకి కెసిఆర్‌, ఎల్లుండి ప్రధానితో భేటి


కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచాలని కోరనున్న సీఎం

kcr
kcr

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి ఉదయం 11.30 గంటలకు ప్రధాని మోడితో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో కెసిఆర్‌ చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను పెంచాలని కోరనున్నారు. అదే విధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను జాప్యం చేయకుండా విడుదల చేయాలని విన్నవించనున్నారు. రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/