అమ్మకానికి కేసీఆర్ గుడి..లేదంటే కూల్చేస్తాడట

కేసీఆర్ ఫై ఎంతో ప్రేమతో కట్టిన గుడిని అమ్మకానికి పెట్టాడు..ఎవరైనా కొనుగోలు చేయండి..లేదంటే ఆ గుడిని కూల్చేస్తానని ఆ అభిమాని పిలుపునివ్వడం చర్చ కు దారితీసింది. మంచిర్యాల జిల్లా దండపెల్లి మండలానికి చెందిన గుండ రవీందర్ అనే కార్యకర్త తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో కృషి చేశారు. ముందు నుండి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన కేసీఆర్ పై గౌరవం తో ఆయనకు గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు తన అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ కు ఎంత చేసిన రవీందర్ కు పార్టీ లో ఏమాత్రం గుర్తింపు ఇవ్వడం లేదట. ఇటీవల ఆయనకు చెందిన కేబుల్ నెట్వర్క్ ను వేరేవాళ్ళు లాక్కున్నారట. దాంతో రవీందర్ న్యాయం కోసం స్థానిక నాయకుల చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రయోజనం దక్కలేదలేదట. దీంతో ప్రగతిభవన్ కు వెళ్లి కేసీఆర్ , కేటీఆర్ లను కలిసి తన న్యాయం జరిగేలా చూడమని వారి దగ్గరికి వెళ్ళాడట.

ప్రగతిభవన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న ఎవరు పట్టించుకోలేదట. దాంతో విసుగు వచ్చిన రవీందర్ తాను కట్టిన కేసీఆర్ గుడిని అమ్మకానికి పెట్టారు. ఫేస్ బుక్ లో కేసీఆర్ గుడి అమ్మబడును అంటూ పోస్ట్ పెట్టారు. ఒకవేళ ఎవరూ ఆ గుడి కొనకపోతే కూల్చేస్తాం అని రవీందర్ పోస్ట్ పెట్టడం ఇప్పుడు మండలంలో వైరల్ గా మారింది.