మద్యం వల్లే దారుణాలు జరుగుతున్నాయి

DK Aruna
DK Aruna

హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ వద్ద తెలంగాణ బిజెపి నేత మాజీమంత్రి డికె అరుణ మహిళా సంకల్ప దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో మద్యం నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మద్యం కారణంగా దిశ, మానస, సమతలపై అత్యాచారాలు జరిగాయని చెప్పారు. మద్యం సేవించిన భర్తలను ఇంట్లోకి రానివ్వమని మహిళలు సంకల్పించాలని పిలుపునిచ్చారు. ఉద్యమ సమయంలో కెసిఆర్‌ చెప్పిన మాటలను మర్చిపోయారని విమర్శించారు. సిఎం కెసిఆర్‌ మహిళల, చిన్నారుల భవిష్యత్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఒక్కపక్క బెల్టు షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతుంటే అవి సిఎం కెసిఆర్‌కు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. యువతను పక్కదారి పట్టిస్తున్న పబ్‌లు, క్లబ్‌లను వెంటనే నిషేధించాలని డికె అరుణ డిమాండ్‌ చేశారు. యువత మద్యానికి బానిసలుగా మారడం బాధాకరమని అరుణ వాపోయారు. అనేక కుటుంబాలు మద్యం కారణంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/