సీఎం కేసీఆర్ నల్గొండను దత్తత తీసుకోవాలి

KOMATIREDDY
KOMATIREDDY

హైదరాబాద్: నల్గొండ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలైన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. గెలిచిన అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోమటిరెడ్డిని కలవడానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తును ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. వారిని చూసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా తీర్పును గౌరవిస్తానని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడినప్పటికీ.. పదవి ఉన్నా.. లేకున్నా ప్రజాసేవ చేస్తానని చెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.