గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల కెసిఆర్‌ దిగ్భ్రాంతి

cm kcr
cm kcr

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపుడి మారుతీరావు 80 కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆయన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సీఎం పేర్కొన్నారు. కాగా గొల్లపూడి మారుతీరావు ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా రంగప్రవేశం చేసిన ఆయన..290కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. ఆత్మగౌరవం, కళ్లు సినిమాలకు రచయితగా నంది పురష్కారాలు అందుకున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/