మాతోనే జగన్‌: కేసిఆర్‌

jagan ,kcr
jagan ,kcr


హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ జగన్‌తో కలిసి పనిచేస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపిలో చంద్రబాబు ఓడిపోతాడని కేసిఆర్‌ జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఇన్ని రోజులు అందరూ ఊహించిందే నేడు కేసిఆర్‌ నోట వినబడింది. జగన్‌తో కలిసి పనిచేస్తామని, ఫెడరల్‌ ఫ్రంట్‌లో జగన్‌ను కలుపుకుంటామని అని అన్నారు. చంద్రబాబు తీరు మారలేదని, రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్ధులను తక్కువ చేసి మాట్లాడుతున్నారని కేసిఆర్‌ ఆరోపించారు. ప్రధాని అభ్యర్థి ఎవరైనా సరే తమకు అనవసరం అని అన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో టిడిపి జోక్యం చేసుకున్నట్లు, తాము కూడా ఆంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని కేసిఆర్‌ అన్నారు. ఎవరైనా పుట్టినరోజు బహుమతి ఇచ్చినపుడు మనం కూడా తిరిగి వారికి రిటర్న్‌ బహుమతి ఇవ్వాలి కదా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపికి కూడా వెళ్లబోతున్నామన్నారు. కానీ ఇప్పుడు జగన్‌తో కలిసి పనిచేస్తామని చెప్పడంతో ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/