డిసెంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు – సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఫై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సీఎం కేసీఆర్, పార్టీ నేతలు నివాళులు అర్పించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్ర‌కార‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు. స‌ర్వేల‌న్నీ మ‌న‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని ధీమా వ్యక్తం చేసారు. ఎన్నిక‌లు డిసెంబ‌ర్‌లో ఉంటాయ‌ని, ఆ లోపు ఎన్నిక‌ల‌కు ప్లాన్ చేసుకోవాల‌ని కేసీఆర్ సూచించారు. నాయ‌కులంతా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ఆదేశించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వీలైతే పాద‌యాత్ర‌లు చేయాల‌ని తెలిపారు. వీలైన‌న్ని ఎక్కువ‌గా కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు నిర్వ‌హించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని సూచించారు.