ఆర్టీసీపై సిఎం కెసిఆర్‌ సమీక్ష

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రగతిభవన్‌లో అధికారులతో ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టుకు ఇవ్వాల్సిన నివేదిక, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఆర్టీసీ సమ్మె మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై కెసిఆర్‌ సమీక్ష జరిపి.. అధికారులకు దశా దిశ నిర్దేశం చేసినట్లు తెలియవచ్చింది. కాగా అన్నివివరాలు శుక్రవారంలోగా కోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/