గంజాయి సాగు చేస్తే రైతుబంధు, రైతుబీమా, కరెంట్ అన్ని కట్ – కేసీఆర్

cm kcr

పోడుభూములలో ఎవరైనా గంజాయి సాగు చేస్తే రైతుబంధు, రైతుబీమా, కరెంట్ అన్ని కట్ అవుతాయని కేసీఆర్ హెచ్చరించారు. పోడుభూముల సమస్య పరిష్కారం, అటవీ రక్షణ- పునరుజ్జీవం, హరితహారం అంశాలపై కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమం, పోలీస్, పంచాయతీ రాజ్ శాఖల ఉన్నతాధికారులతో శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు మంత్రులు హాజరయ్యారు.

ఈ సందర్భాంగా కేసీఆర్ మాట్లాడుతూ…గంజాయి సాగు చేసే రైతులకు రైతుబంధు, రైతుబీమా, కరెంట్ సౌకర్యం నిలిపివేయడంతో పాటు, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే ఆర్వోఎఫ్ఆర్ పట్టా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీని పూర్తిస్థాయిలో అరికట్టి తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.