మొయినాబాద్ ఫామ్ హౌస్ వీడియోలను బయటపెట్టిన కేసీఆర్

మొయినాబాద్ ఫామ్ హౌస్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఫై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియా సమావేశమయ్యారు. ఫామ్ హౌస్ లో జరిగిందంతా వీడియో ను మీడియా ముందు పెట్టారు. ఈ రోజు మీడియా స‌మావేశం ఏదైతో ఉందో చాలా భార‌మైన మ‌న‌సుతో దుఖంతో నిర్వ‌హిస్తున్నాను. చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఈ దేశంలో నెల‌కొని ఉన్నాయి. ఈ దేశంలో దుర్మార్గం జ‌రుగుతుంది. ప్ర‌జాస్వామ హ‌త్య నిర్ల‌జ్జ‌గా విశృంఖ‌లంగా, విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతోన్న ప్ర‌జాస్వామ్య‌ హ‌త్య . ఈ ప్ర‌జాస్వామ్య హంత‌కుల యొక్క స్వైర‌విహారం ఈ దేశం యొక్క పునాదుల‌కే ప్ర‌మాదక‌రం. అత్యంత భ‌యంక‌ర‌మైన‌ది. చాలా భాదాక‌ర‌మైన ప‌రిస్థితి. కనీసం మ‌న ఊహాకు కూడా అంద‌దు. అందుకే బాధ‌తో మాట్లాడుతున్నాను అన్నారు.

ఈ రోజు మునుగోడు పోలింగ్ ముగిశాకనే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌తో వెయిట్ చేశాను. మునుగోడులో కూడా వెకిలి ప్ర‌య‌త్నాలు చేశారు. చేతుల్లో పువ్వు గుర్తులు, ఫేక్ ప్ర‌చారాలు చేశారు. పాల్వాయి స్ర‌వంతి త‌న‌ను క‌లిసిన‌ట్టు, కొన్ని టీవీల పేర్లు పెట్టి ప్ర‌చారం చేశారు. ఎల‌క్ష‌న్లు వ‌స్తాయి, పోతాయి. గెలుస్తం, ఓడిపోతం. హుజురాబాద్‌లో ఓట‌మి పాల‌య్యాం. దుబ్బాక‌లో స్వ‌ల్ప మెజార్టీతో ఓడిపోయాం. నాగార్జున సాగ‌ర్‌, హుజుర్‌న‌గ‌ర్‌లో గెలిచాం. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌వించాలి. మేం గెలిస్తేనే లెక్క అంటే ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ ఉంట‌ది. రాజ‌కీయాల్లో, ప్ర‌జాజీవితంలో సంయ‌మ‌నం ఉండాలి. చివ‌రికి ఎన్నిక‌ల క‌మిష‌న్ ఫెయిల్ అయింద‌ని ఆరోపించారు.

సుప్రీంకోర్టు సహా.. అన్ని రాష్ట్రల హైకోర్టు న్యాయమూర్తులను చేతులు జోడిండి అడుగుతున్నా.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అంటూ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో జరిగిన పరిణామాలపై సమగ్ర వివరాలతో.. దేశంలోని ప్రధాన న్యాయమూర్తులకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలను పంపాం.. ఇది అందరికీ తెలియాల్సిన విషయం అన్నారు. ఫాం హౌస్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర వివరాలు, 60 నిమిషాల వీడియో తెలంగాణ హైకోర్టు సహా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఎనిమిది ప్రభుత్వాలను కూలగొట్టాం.. మరికొన్నింటిని పడగొడతాం అంటూ పేర్కొన్నారు. ఈ ముఠాలో 24 మంది ఉన్నారు.. పెద్ద క్రైం.. అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారితే వందకోట్లు ఇస్తామన్నారని.. వై కేటగిరి సెక్యూరిటీ ఇస్తామని హామీనిచ్చారని.. రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో ప్రభుత్వం ఉందని, కాపాడాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్దంగానే చేరారని, ఇలాంటి దురాగతానికి తాము పాల్పడలేదని సీఎం కేసీఆర్ తెలిపారు.