సీఎం కేసీఆర్ ఇంట్లో రాఖీ సంబరాలు అంబరాన్ని తాకాయి

ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్బంగా యావత్ అన్నాచెల్లెళ్లు , అక్కాతమ్ముళ్ల అంత కూడా ఎంతో సంబరంగా రాఖీ పండగను జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అందుకే ప్రతి ఏడాది అందరు రాఖీ పండగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో రాఖీ సంబరాలు అంబరాన్ని తాకాయి. కేసీఆర్‌కు ఆయ‌న సోద‌రీమ‌ణులు రాఖీ క‌ట్టారు. అక్కాచెల్లెళ్లు క‌లిసి కేసీఆర్‌కు హార‌తి ప‌ట్టి, రాఖీలు క‌ట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వ‌దించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం రాఖీ పండుగను పుర‌స్క‌రించుకొని.. ప్ర‌త్యేక‌మైన ఫోటోల‌ను షేర్ చేశారు. కొన్ని బంధాలు చాలా ప్ర‌త్యేక‌మైన‌వి అని అంటూ కేటీఆర్ క్యాప్ష‌న్ ఇచ్చారు. చిన్న‌ప్పుడు త‌న సోద‌రి క‌వితతో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.