కేసీఆర్ పర్యటన.. నిజామాబాద్ లో కొనసాగుతోన్న బీజేపీ నేతల అరెస్ట్

సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బిజెపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటారన్నా కారణాలతో ఇప్పటికీ జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు, ముంపు గ్రామాల ప్రజలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు పేస్కేల్ కోసం ఆందోళన చేస్తున్న వీఆర్ ఏలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు.

కేసీఆర్ పర్యటనతో బోధన్ లో NDSL ఫ్యాక్టరీ కార్మికులను పోలీసులు అర్ధరాత్రి పీఎస్ కు తరలించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో NDSL ఫ్యాక్టరీని తెరిపిస్తామని MLC కవిత పలుమార్లు హామీ ఇచ్చారని, ఇప్పుడు కేసీఆర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని హామీ ఇవ్వాలని కార్మికులు, పలు పార్టీల నేతలు డిమాండ్ చేస్తూ.. అక్రమ అరెస్టులు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క భైంసా నుంచి ప్రతి రోజు ఉదయం నుంచి నిజామాబాద్ కు రెగ్యులర్ గా బస్సులు ఉంటాయి. అయితే సీఎం టూర్ ఉందని చెప్పి భైంసా నుంచి ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. సీఎం రాకతో నిజామాబాద్ కు బస్సులు రద్దు చేస్తున్నట్లు బస్టాండ్ లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.