నరేంద్రమోడి, కేసీఆర్‌ దుష్టపాలన: నారాయణ

cpi party narayana
cpi party narayana

హైదరాబాద్‌ ప్రభాతవార్త : హైదరాబాద్‌ జూభ్లీహిల్స్‌లో రహమత్‌నగ్‌లో సోమవారం జరిగిన ప్రజాకూటమి సభలో సీపీఐ నేత నారాయణ పాల్గోన్నారు. ఆయన మాట్లాడుతూ నరేంద్రమోదీ, కేసీఆర్‌ దుష్టపాలనను అంతం చేస్తామనిఅన్నారు. కేసీఆర్‌ బీజేపీ అడుగులకు మడుగులు వత్తుతున్నారని ఆరోపించారు. ఇక్కడ కేసీఆర్‌ని ఓడిస్తేనే.. కేంద్రంలో మోదీని ఓడించగలమని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, ఎంఐఎం మెట్రోకు వ్యతిరేకమని విమర్శించారు. చార్మినార్‌కు వెళ్లి నేను సీఎంనని కేసీఆర్‌ చెప్పగలరా? అని నారాయణ ప్రశ్నించారు. డిసెంబర్‌ 11న కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కి పోయి వంకాయలు కోసుకోవాల్సిదేనని నారాయణచెప్పారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ రహమత్‌నగర్‌లో ప్రజాకూటమి సభకు హాజరయ్యారు.