ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రులతో భేటీ కాబోతున్న కేసీఆర్

ఢిల్లీ పర్యటన లో బిజీ బిజీ గా ఉన్న కేసీఆర్..వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ప్రధాని మోడీని కలిసి పలు అంశాల పట్ల చర్చలు జరిపారు. కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కుకు వెయ్యి కోట్లివ్వాలని, ప్రత్యేక గిరిజన వర్సిటీని నెలకొల్పాలని, ట్రిపుల్‌ ఐటీ, ఐఐఎం ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్‌ నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని, రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయాలని, పీఎంజీఎస్‌వై కింద అదనపు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు.

ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రోడ్ల అభివృద్ధి అంశాలపై చర్చ జరిపే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే ఏడు గంటలకు కేంద్ర అ జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ కానున్నారు. నీటి ప్రాజెక్టుల అంశాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ లోని పలు అంశాలపై కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.