హుజురాబాద్ ఉప ఎన్నిక హోరు..ఆ ఇద్దరికీ కూడా పదవులు దక్కబోతున్నాయా..?

రాష్ట్ర రాజకీయాలు మొత్తం హుజురాబాద్ నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. తెరాస , బీజేపీ , కాంగ్రెస్ పార్టీలతో సహా మిగతా పార్టీల ఫోకస్ అంత కూడా హుజురాబాద్ నియోజకవర్గం పైనే పెట్టారు. అయితే ముఖ్యంగా తెరాస vs బిజెపి వార్ నడుస్తుంది. ఎలాగైనా ఈటెల ను ఓడించేందుకు కేసీఆర్ ఎన్ని ప్లానులు చేస్తున్నారు. ఇప్పటికే దళిత బంధు తో దళితులను ఆకర్షించిన ముఖ్యమంత్రి..నేతలకు సైతం వివిధ పదవులు కట్టబెట్టి వారిని సంతోష పరుస్తున్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ, బండా శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వకుళాభరణం కృష్ణమోహన్‌రు బీసీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన కేసీఆర్..మరో ఇద్దరికీ కూడా పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఈటల రాజేందర్ అనుచరుడు, ఆయన సామాజికవర్గానికి చెందిన పింగళి రమేశ్ లకు కేబినెట్ ర్యాంక్‌తో కూడిన పదవి అలాగే ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లు ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీమంత్రి పెద్దిరెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు కేబినెట్ ర్యాంక్‌తో కూడిన పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పింగళి రమేశ్‌కు ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టబోతున్నట్లు పార్టీ లో నేతలు మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై కేసీఆర్ తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. మరోపక్క నియోజకవర్గం లో శుక్రవారం నుండి దళితబంధు సర్వే మొదలైంది. మొత్తం 48 అంశాలపై దళిత కుటుంబాల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.