నీతి ఆయోగ్‌ సమావేశానికి దీదీ, కేసిఆర్‌ డుమ్మా..

mamata banerjee, KCR
mamata banerjee, KCR

న్యూఢిల్లీ: ఇవాళ జరగనున్న నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఇవాళ సమావేశం అవుతుంది. ప్రధాని మోది అధ్యక్షతన నీతిఆయోగ్‌ సమావేశం జరగనున్నది. రాష్ట్రపతి భవన్‌లో సమావేశం ఉంటుంది. రైతుల సమస్యలు, మావో ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, కరవు లాంటి అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హజరుకానున్నారు. బెంగాల్‌ సియం మమతా బెనర్జీ..ఈ సమావేశానికి దూరం కానున్నారు. అలాగే తెలంగాణ సియం కేసిఆర్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఎన్నికల సమయంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం చేసిన ప్రయత్నాలతో వారి మధ్య గ్యాప్‌ పెరిగింది. దీంతో ఆయన కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశం వ్యర్థమని దీదీ అన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రణాళికలకు ఆర్ధిక శక్తినిచ్చే సత్తా నీతి ఆయోగ్‌కు లేదన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/