కేసీఆర్‌కు మోడీ భయం పట్టుకుంది: ఈటెల

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మోడీ భయం పట్టుకుందని అన్నారు హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మునుగోడు బిజెపి సమరభేరి సభ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్‌ పార్టీర మద్దతా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల తపన అని అన్నారు. బీజేపీ మీటింగ్‌ సక్సెస్‌ కావొద్దన్నదే సీఎం కేసీఆర్‌ కుట్ర అని అన్నారు. అందుకే ఒక రోజు ముందు సభ పెట్టుకున్నారన్నారు.

ఉప ఎన్నిక వస్తే మునుగోడులో హుజూరాబాద్ కన్నా గొప్ప తీర్పు వస్తదని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ పార్టీని ఓడగొట్టాలని ఈటల పిలుపునిచ్చారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మోటర్లకు మీటర్లు పెడ్తరని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఈటెల విమర్శించారు.

వామపక్ష నాయకులు కేసీఆర్ తో కలవడం కన్నా హీనమైన చర్య మరొకటి లేదని ఈటల విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద ధర్నాలు నిషేధించిన నాయకుడు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలా చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు. సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఎనిమిదిన్నరేండ్లలో ఏనాడైనా ప్రగతి భవన్ లో అడుగుపెట్టారా అని ప్రశ్నించారు. ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే సీఎం కేసీఆర్ ఏనాడైనా పిలిచి చర్చించి సమస్యను పరిష్కరించాడా అని నిలదీశారు.