దేశ రాజకీయాల్లో కెసిఆర్‌ కీలకం కానున్నారు: తుమ్మల

Thummala Nageswara Rao
Thummala Nageswara Rao

ఖమ్మం: నేడు కూసుమంచి మండలం కేంద్రంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోసం ఇటింటా ఎన్నికల ప్రచారంలో త్ముమల నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా సాగిద్దని,బిజెపి ,కాంగ్రెస్‌ పార్టీలకు సోంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసే సత్తలేదన్నారు.దేశ వ్యాప్తంగా 70వేల టిఎంసిల పాగునీరు,3లక్షల మెగావాట్ల విద్యుత్‌ వృదా అవుతోందన్నారు.వీటిని వినియోగంలోకి తేచ్చే ప్రణళికలు అ పార్టీలకు లేవని విమర్శించారు. దేశ రాజకీయాల్లో కెసిఆర్‌ కీలకం కానున్నారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాలు అన్ని రాష్ట్రాల్లో అమలు కానున్నాయని తుమ్మల తెలిపారు.

మరిన్నీ తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/