కెసిఆర్‌ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు

టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం..ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తోంది

L. Ramana
L. Ramana

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం..ఇచ్చిన హామీలను విస్మరించి పాలిస్తోందని..అందుకే ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టామని టిడిపి నేత ఎల్‌.రమణ అన్నారు. స్థానిక సమస్యలను బహిర్గతం చేయాలనే అన్ని జిల్లాల నుంచి నాయకులను ఆహ్వానించామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ వారిని ప్రత్యక్ష దేవుళ్లు అన్నారని, తర్వాత వారిని దయ్యాలు అని మాట్లాడారని విమర్శించారు. సీఎం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులను ఇబ్బంది పెట్టిన కెసిఆర్‌..సమ్మె అనంతరం చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బంది పెటారన్నారు. అన్ని సమస్యలపై కెసిఆర్‌ చర్చించే ప్రయత్నం చేస్తామని ఎల్‌. రమణ తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/