చింతమడకకి అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తా

మూడు పంటలు పండే గ్రామంగా చింతమడక

cm kcr
cm kcr

సిద్దిపేట: సిఎం కెసిఆర్‌ తన సొంత గ్రామం చింతమడకకు చేరుకున్నారు. అనంతరం గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతు నెలరోజుల్లో చింతమడక గ్రామంలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను కోరారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరుస్తామన్నారు. వలస వెళ్లిన వారిని కూడా పిలిచి పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలని సూచించారు. ఎవరు ఏ ఉపాధి మార్గం ఎంచుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
సిద్దిపేటకు త్వరలో రైలు వస్తుందని సీఎం కెసిఆర్‌ హామీ ఇచ్చారు. సిద్దిపేటకు అందించిన మంచినీటి పథకం స్ఫూర్తితోనే మిషన్‌ భగీరథకు రూపకల్పన చేశామని చెప్పారు. చింతమడక గ్రామానికి 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీకమాసంలో ఇక్కడ గృహప్రవేశాలు జరగాలన్నారు. తాను ప్రవేశపెట్టిన పథకాల్లో రైతు బంధు, రైతుబీమా ఎంతో సంతృప్తినిచ్చాయని, తొలి ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించామని తెలిపారు.ఖఖచింతమడక నన్ను కనిపెంచింది. ఈ గ్రామం కోసం నేను ఎంత చేసినా తక్కువే. చింతమడక కోసం అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తా. అదనపు నిధులను ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్‌ పొందవచ్చు అని సిఎం కెసిఆర్‌ తెలిపారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/