తెరాస ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కేసీఆర్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబదించిన షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలని మూడు ఎమ్మెల్సీ మరియు తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి. నవంబర్ 09 ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువబనుండగా…. నవంబర్ 16 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జాబితా ఫైనల్ కు వచ్చింది. ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, టి.రవీందర్ రావు పేర్లను ఫైనల్ చేశారు.

కడియం శ్రీహరి…వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా , గుత్తా సుఖేందర్ రెడ్డి..నల్గొండ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా టికెట్ కన్ఫామ్ కాగా, టి.రవీందర్ రావు కూడా వరంగల్ జిల్లా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసారు. మరో మూడో స్థానాల్లో ఎల్.రమణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్ సీ.కోటి రెడ్డి నేతలు పోటీ పడుతున్నట్లు సమాచారం ఉంది. అయితే తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా మధుసూదనాచారి వంటి నేతల పేర్లకు ప్రాధాన్యత దక్కవచ్చని అంటున్నారు. ఆ ముగ్గురిలో ఎవరెవరిని అదృష్టం వరిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.