గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారి పేరును ఆయన ఖరారు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తెలంగాణ కేబినెట్ ప్రతిపాదన పంపింది. ఈ ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేస్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోతారు. ఈ మధ్యాహ్నంలోగానే ఈ ఫైల్ పై గవర్నర్ సంతకం చేస్తారని తెలుస్తోంది.

కాగా, ఇంతకుముందు కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫైలును గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టారు. దీంతో, గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారిని ప్రభుత్వం ప్రతిపాదించింది. మధుసూదనాచారి గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన సంగతి తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/