వానాకాలం పంట కొనుగోలు ఫై కేసీఆర్ కీలక ప్రకటన

గత కొద్దీ రోజులుగా రైతుల్లో ఒకటే ఆందోళన యాసంగి పంట అటుపెట్టి..ప్రస్తుత వానాకాలం పంట కొనుగోలు చేస్తుందా లేదా..ఇంతవరకు ఎక్కడ కూడా కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వరి కోసి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తున్నాం..ఇంతవరకు ఏ అధికారి వచ్చి చూడలేదు. బయట బిజెపి , తెరాస నువ్వు కొనాలంటే నువ్వు కొనాలని గొడవలు పడుతున్నాయి. పండించిన పంట ఏంచేయాలి ఇలా రైతులు అనేక ప్రశ్నలతో నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పటు చేసి వానాకాలం పంట కొనుగోలు ఫై కీలక ప్రకటన చేసారు.

ధాన్యం కొనుగోలు కోసం 6600 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. అవసరమైతే మరిన్ని కేంద్రాలను ఓపెన్ చేస్తామని కేసీఆర్ తెలిపారు. రైతులు ధాన్యం తేవడానికి తొందరపడకూడదని కేసీఆర్ సూచించారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొన్ని రోజుల వరకు పంటను కోయవద్దని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెవడానికి తొందర పడవద్దని తెలిపారు. అలాగే యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్‌ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేదు. మీం కోరిందంటే అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం సేకరించినట్లే తెలంగాణ నుంచి సేకరిస్తరు కాబట్టి.. సంవత్సరం టార్గెట్‌ ఇవ్వండి.. దాన్ని బట్టి రాష్ట్రంలో సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అక్కరుంటది. అందువల్ల చేయమని రెక్వెస్ట్‌ చేసినం. ఎందుకోమరి సరైన పద్ధతుల్లో రావడం లేదు. మొన్న ధర్నా చేసిన రోజున రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. మాట్లాడుతం అన్నరు. చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీకి వెళ్తున్నాం అన్నారు.