కేసీఆర్ నిర్ణయం టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్‌ : తెలంగాణ లో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఐదు స్థానాల్లో నాల్గింటిని టీఆర్ఎస్ తీసుకుని, ఒక స్థానాన్ని తమ మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ లను తమ పార్టీ అభ్యర్థులుగా పేర్కొన్నారు.