జస్టిస్‌ పార్థివ దేహానికి నివాళులర్పించిన కెసిఆర్‌

ts cm kcr
ts cm kcr


హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు ఈరోజు కన్నుమూసిన జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి నివాసానికి సిఎం కెసిఆర్‌ వెళ్లి ఆయన భౌతికకాయపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు గవర్నర్‌ నరసింహన్‌, వైఎస్‌ జగన్‌ కూడా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/